తాడేపల్లిగూడెం పట్టణంలో జోరుగా జనసేన ప్రచారం

తాడేపల్లిగూడెం పట్టణంలోని 16వ వార్డులో మంగళవారం కూటమి ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ వల్ల బాబ్జి, ఈతకోట తాతాజీ ముగ్గురూ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రజలకు ఏం భరోసా ఇస్తుందో వివరిస్తూ.. జగన్ ప్రజలను ఏ విధంగా మోసం చేశారో జగన్ వస్తే రాష్ట్రానికి ఎంత ప్రమాదమో తెలియజేస్తూ ముందుకు సాగారు. పట్టణంలోని టిడిపి జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలు భారీగా ఈ ప్రచారంలో పాల్గొని ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ కి గ్లాస్ గుర్తుకు, ఎంపీ అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస్ వర్మకి కమలం గుర్తుకు ఓటు వేయాలంటూ అభ్యర్థించారు. నిప్పులు చెరిగే ఎండను సైతం లెక్కచేయకుండా ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా కార్యకర్తలు, నాయకులు, జనసైనికులు ప్రజలు అభిమానులు కూటమి ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు.