తొర్రూర్ పట్టణంలో జనసేన ప్రచారం

పాలకుర్తి నియోజకవర్గం: పాలకుర్తి జనసేన ఇంచార్జ్ వెల్తూరి నగేష్ ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్న తొర్రూర్ పట్టణంలోని సోమవారం గ్రామం నుండి జనసేన పార్టీ ప్రచార కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వెల్తూరి నగేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పాలకుర్తి నియోజకవర్గం ప్రజల్లోకి జనసేన పార్టీని తీసుకువెళ్లడం మా లక్ష్యంగా భావించి ప్రజల్లోకి కదలడం జరిగింది. మార్పు కోసం మేము సైతం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, కడెం యాదగిరి, రావుల హరీప్రసాద్, రామసాని రాజు, కిన్నెరా రాజు, కిన్నెరా కొమురయ్య, కిన్నెరా నాగరాజు, కిన్నెరా వీరేష్, కిన్నెరా కుమార్, గంధం రాములు, కిన్నెరా యాదగిరి, కిన్నెరా మహేందర్, ఊర గణేష్, గంధం మహేష్, కడెం రాజు, ఊర విష్ణు, ఊర రాజు, ఎం.డి మతిన్ పాల్గొన్నారు.