సొంత ఖర్చులతో పాఠశాల ప్రహరీ గోడ నిర్మించిన జనసేన చోడవరం నియోజకవర్గ ఇంచార్జి

చోడవరం నియోజకవర్గం, బుచ్య్యపేట మండలం, వడ్డాది గ్రామం, ఎస్సి కాలనీలో ప్రాధమిక పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం పూర్తికానందున విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురవ్వడం పై స్పందించిన నియోజకవర్గ ఇంచార్జి పివిఎసెన్ రాజు వారి సొంత నిధులతో నిర్మాణ పనులలో భాగంగా శంకుస్థాపన చేపట్టారు. ఈ కార్యక్రమములో మండల పార్టీ అధ్యక్షులు గూనూరు మూలునాయుడు(చోడవరం), డి యస్ నాయుడు(బుచ్య్యపేట), చోడవరం మండల ప్రధాన కార్యదర్శి అల్లం రామఅప్పారావు, బుచ్య్యపేట మండల వీరమహిళా అధ్యక్షురాలు నమ్మి నాగలక్ష్మి, నందవరపు నాయుడు, వడ్డాది స్కూల్ కమిటీ చైర్మన్ కోరుకొండ గణేష్, సయ్యపురెడ్డి నవీన్, దొండా సాయి, యడ్ల రామ్మూర్తి, కోరుకొండ అచ్చిబాబు, తుమ్మపాల రమేష్, సుంకర చరణ్ నమ్మి తాతాజీ, మువ్వల నాగార్జున మరియు జనసైనికులు పాల్గొన్నారు.