చిన్నగొట్టిగల్లు మండలంలో జనసేన కమిటీ సమావేశం

చిత్తూరు జిల్లా, చంద్రగిరి నియోజకవర్గం జనసేన పార్టీ చిన్నగొట్టిగల్లు మండల కమిటీ అధ్యక్షులు గుండాల రమేష్ ఆధ్వర్యంలో మండల కమిటీ ఎన్నిక ప్రక్రియ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, చంద్రగిరి నియోజకవర్గ నాయకులు జిల్లా కార్యదర్శి దేవర మనోహర, మండల ఉపాధ్యక్షులు నాని, యర్రావారిపాల్లెం మండల అధ్యక్షులు సుబ్రమణ్యం, కుమార్, వినోద్, రూపేష్, వినోద్.జే, జయశంకర్, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.