వీధిలైట్లు వెలగడం లేదని కాకినాడ జిల్లా కలెక్టర్ కి జనసేన వినతి

పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు పిఠాపురం నియోజవర్గం, యు కొత్తపల్లి మండలం, యండపల్లి గ్రామ పంచాయతీ తోటూరు గ్రామానికి మూర్తి టైల్స్ బాబి మల్లం శ్రీను ముప్పన రత్నం వెళ్లడం జరిగింది. అందులో భాగంగా నెల రోజుల నుండి అక్కడ వీధిలైట్లు సుమారు 10 స్తంభాల నుండి 15 స్తంభాలకు వెలగడం లేదని ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని మన జనసేన పార్టీకి చెప్పటం జరిగింది. వెంటనే స్పందించిన జనసేన పార్టీ నాయకులు కాకినాడ జిల్లా కలెక్టర్ వారికి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఆమె సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టర్ వారికి జనసేన పార్టీ పి. ఎస్.ఎన్. మూర్తి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టైల్స్ బాబీ, బీసీ నాయకులు ఎండ్రపు శ్రీనివాసరావు, వీర మహిళ వినకొండ అమ్మాజీ మరియు పి.ఎస్.ఎన్. మూర్తి, పాల్గొనడం జరిగింది.