డ్రైనేజ్ నిర్మించాలని జనసేన డిమాండ్

ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ సూచన మేరకు ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు దాడి భాను కిరణ్ ఆధ్వర్యంలో సంగం మండలం కోలగట్ల గ్రామం ఎస్సి కాలనీ నందు తేలిక పాటి వర్షాల కారణంగా ఎస్సి కాలనీ ప్రజలు నడిచే రహదారి వర్షం నీరుతో మరియు గుంతలు, బురద మయంతో ఏర్పడడం జరిగింది. ఇప్పటికైనా కోలగట్ల గ్రామం ఎస్సి కాలనీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధికారులు గుర్తించి ఎస్సి కాలనీలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ నిర్మించాలని అధికారులని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. లేనిపక్షంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ సమస్యలు తీర్చే దిశగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సంగం మండల నాయకులు హాజరత్, గ్రామ ప్రజలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.