జనసేనాని ప్రజాదరణకు ఓర్వలేకనే కుట్ర

నేడు తెలుగునాట అత్యంత జనాదరణ ఉన్న వ్యక్తులలో పవన్ కళ్యాణ్ ఒకరు. తానొక గొప్ప సినిమా స్టార్ అనేకంటే ఒక బాధ్యతగల దేశ పౌరుడినని చెప్పుకోవడానికి ఎక్కువ ఇష్టపడతానని ఎన్నో సంధర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. ఒక సామజిక బాద్యతతో తనవంతుగా ప్రజలకి మేలు చేయాలని ఒక మంచి పరిపాలన తీసుకురావాలని వ్యవస్థల్లో ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకురావలనే సంకల్పంలో జనసేన పార్టీ పెట్టి తన శక్తికి మించి పోరాడడం అనేది మామూలు విషయం కాదు. తనకి ఆదాయం ఇచ్చే ఒకే ఒక వృత్తి సినిమా. ఒకపక్క రాత్రి షెడ్యూల్ అంతా సినిమాలు చేసుకుంటూ మరోపక్క ఉదయం సమయం అంతా ప్రజలకి సమయం కేటాయించి ప్రజల సమస్యలు వింటూ నిరంతరం ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు. ఒకపక్క తాను ఇంత కష్టపడుతూ మరోపక్క తన కష్టార్జీతం కష్టాల్లో ఉన్న ప్రజల కోసం కోట్ల డబ్బుని ఉదారంగా సాయం చేయడం అనేది దేశంలో ఏ ఇతర రాజకీయ పార్టీ అధినేతలు కలలో సైతం ఊహించని విషయం. ఇంతటి వ్యక్తిత్వం ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాను ఉత్తరాంధ్ర మూడు జిల్లాల పర్యటన చేస్తున్నట్టు మూడు నెలల క్రితమే క్యాడర్ అందరికి చెప్పడం ఆపై 10 రోజుల ముందే విమాన టిక్కెట్స్ కొనడం అన్నీ చేసుకొని పోలీసుల అనుమతి కూడా తీసుకొని జనవాణి కార్యక్రమం ఫిక్స్ చేయడం జరిగింది. కానీ గత నెల అక్టోబర్ 15 తేదీన ఆయన విశాఖ విమానాశ్రయంలో దిగినప్పటి నుండి ఆయన తిరిగి విజయవాడ వెళ్ళేవరకు జరిగిన పరిణామాలు ఆయన పట్ల వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టి ఒక పథకం ప్రకారం ఒక డిశిపి స్థాయి అధికారి ఆయన వాహనంపై ఎక్కి ఆయనను కంట్రోల్ చేసే స్థాయికి రావడం ఆయన హోటల్ గదిలో తనిఖీలు ఆయన వాహనం తాళాలు అడగడం, ఆయనని గది నుండి రాకుండా కట్టడి చేయడం జనవాణి జరగకుండా అడ్డుకోవడం జనసేన నేతలని అక్రమ అరెస్టులు చేసి రిమాండ్ చేయడం మనం అందరం చూశాము. విశాఖ ఘటన తరువాత ఒక విషయం మాత్రం స్పష్టంగా రాష్ట్రానికి ప్రజలకి తెలిసిపోయింది. వైసీపి ప్రభుత్వం జనసేన అధినేతపై అనువణువునా నిర్బంధించడం లేదా భద్రత ప్రమాణాలు పాటించకుండా అంతటి ప్రజాదరణ ఉన్న ఒక పార్టీ అధినేతకి ప్రాణాలకి ముప్పు తెచ్చేలా పోలీసులే ప్రవర్తించడం అనేది ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఎన్నడూ చూడని, వినని విషయం. తమ విశాఖ పర్యటన వల్ల వేరే ఇతర పార్టీ కార్యక్రమాలు అడ్డుకోవటం తమ పార్టీ లక్ష్యం కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖలో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఈ మొత్తం తతంగం చూస్తే గతంలో కోడి కత్తి ఘటనను గుర్తు చేస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. వాళ్లే పొడిపించుకుని వాళ్లే హడావుడి చేశారని, విశాఖ ఎయిర్పోర్ట్ ఘటన అలాగే చేశారేమో? అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వైసీపీ మూడు రాజధానులకి మద్దతుగా చేసే విశాఖ గర్జన కార్యక్రమానికి ముందే తమ జనవాణి కార్యక్రమం ఖరారైందని తెలిపారు. తమ పార్టీ కార్యక్రమాలు ఎలా చేసుకోవాలో, మేం ఎక్కడికి వెళ్లాలో కూడా వైసీపీ చెబుతుందా? మేం ఎక్కడికి వెళ్తామో వైసీపీ నేతలకు చెప్పాలా? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరిస్తే ప్రజలు తమ దగ్గరికి ఎందుకు వస్తారని ప్రశ్నించారు. జనసేన అధినేతకి ప్రాణహాని ముప్పు ఉన్నట్టు నిరూపించే మరో ముఖ్యమైన విషయం మూడు రోజల కింద బయటకు వచ్చింది. హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటివద్ద అనుమానాస్పద కొందరు వ్యక్తులు తిరగడం, అలాగే జూబ్లీ హిల్స్ పార్టీ ఆఫిస్ వద్ద కొందరు వ్యక్తులు వచ్చి గొడవ చేయడం తెలిసింది. పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి బయటకు వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు ఆయన వాహనాన్ని కొందరు అనుసరిస్తున్నారని, వారెవ్వరూ ఆయన అభిమానులు కాదని సెక్యూరిటీ వారు చెబుతున్నారు. వారి కదలికలు అనుమానించే విధంగా ఉన్నాయని పవన్ వ్యక్తిగత రక్షణ సిబ్బంది చెప్పారు. ఈ విషయం తెలిసి పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు అందరూ ఒక్కసారిగా షాక్ గురైయ్యారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పథకం ప్రకారం దాడి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశాన్ని ఈ వరుస ఘటనలు నిరూపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రాణాలకి ముప్పు తెచ్చేలా కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే కడపజిల్లా సిద్దవటం కౌలు రైతు భరోసా యాత్రకి జనసేన అధినేత వెళ్ళేప్పుడు కూడా ఒక వాహనం ఆయన కాన్వాయ్ లోకి జొరబడాలని ప్రయత్నించగా సెక్యూరిటీ వారు చాకచక్యంగా నాడు వాహనాన్ని తప్పించడం జరిగింది. ప్రజల పట్ల బాధ్యత కలిగిన ఏకైనా నాయకుడు పవన్ కల్యాణ్ ఒక్కరే అని అందరూ ఒప్పుకునే విషయం. మరి ముఖ్యంగా ఈమధ్య వైసీపి ప్రభుత్వం రహస్యంగా చేయించుకున్న అన్ని సర్వేలలో అలాగే ఇంటలిజెన్స్ రిపోర్ట్ కూడా పవన్ కళ్యాణ్ సిఎం అవుతారని రావడంతో వైసీపి ప్రభుత్వంలోని కొందరు పెద్ద తలలు కిరాయి వ్యక్తుల ద్వారా జనసేన అధినేత ప్రాణాలకి ముప్పు తలపెట్టేలా ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీకి అంతర్గతంగా అందుతున్న సమాచారం. జనసేన అధినేత హత్యకు 250 కోట్ల డీల్ చేసినట్టు కొందరికి సుపారి ఇచ్చినట్టు కేంద్ర నిఘా వర్గాలకి అందిన సమాచారం బయటకు రావడంతో అధినేతని హత్య చేసేందుకు కుట్ర పక్కగా స్కెచ్ వేసినట్టు అర్ధం అవుతుంది.

ఇందులో ప్రజలకి క్యాడర్ తెలియాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి అవేంటంటే..??

  1. అసలు ఈ డీల్ ఆలోచన ఎవరిది ?
  2. ఈ డీల్ అమలు చేస్తున్నది ఎవరు ?
  3. సుపారిగా అడ్వాన్స్ ఎంత ఇచ్చారు ? ఎవరికి ఇచ్చారు ?
  4. దీని వెనుక ఉన్న పెద్ద తలకాయ ఎవరు ?
  5. కుట్రని ఏ విధంగా అమలు చేయనున్నారు ?

పవన్ కళ్యాణ్ ప్రాణం కోట్లాదిమంది అట్టడుగు పేద, బహుజన వర్గాలకు ఎంతో ముఖ్యమని, అందుకే ఆయనను కాపాడుకునేందుకు ఉద్యమం చేయాలని, జనసేన క్యాడర్ పిలుపునిచ్చింది. అలాగే ఆయనకు కాలి గోరు గీసుకున్నా తరువాత జరిగే పరిణామాలకి బాధ్యత ఎవరు వహించినా చేసేది ఏమీ ఉండదని కూడా క్యాడర్ ప్రభుత్వాలకి హెచ్చరించారు. ఆయన భద్రత విషయంలో తక్షణమే పోలీసులు జోక్యం చేసుకొని జరిగిన ఘటనలకి బాధ్యతులని ఎవరో తేల్చి సుపారి విషయం కూడా వెంటనే తేల్చి ఆ పెద్ద తలకాయ ఎవరో ప్రజలకి పార్టీ క్యాడర్ అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నారు. మరోవైపు ఇదే అంశంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించి, పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణా డీజీపీని డిమాండ్ చేశారు. రెక్కీ నిర్వహించిన అపరిచితులు వెనుక ఏ శక్తులు ఉన్నాయన్న విషయం బహిరంగ పర్చాలని కోరారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ కు భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను గుర్తుతెలియని వాహనాలు వెంబడించిన ఘటనపై అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు రవణం స్వామినాయుడు స్పందించారు. పవన్ కళ్యాణ్ కు ఏదైనా జరిగితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే భాధ్యతని అన్నారు. భారత దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగన రాజకీయనాయకులు పవన్ కళ్యాణ్ అని, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పవన్ కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై కేంద్ర హోంశాఖకు లిఖితపూర్వకంగా కొరనున్నామని, లేదంటే మా ప్రాణాలైనా అడ్డుపెట్టి పవన్ కళ్యాణ్ ను కాపాడుకుంటామన్నారు. పవన్ కళ్యాణ్ కి కేంద్ర ప్రభుత్వం యొక్క జెడ్ ప్లస్ (Z+)కేటగిరి భద్రత కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు కేంద్ర హోమ్ శాఖ మంత్రివర్యులు అమిత్ షా లను ఈ మెయిల్స్ ద్వారా, ట్విట్టర్ ద్వారా మరియు ఉత్తరాల ద్వారా అడగవలసిందిగా కోరుతూ ఓ క్యాంపెయిన్‌ను ఇప్పటికే జనసైనికులు ప్రారంభించారు. ఎవరెవరికి లేఖలు రాయాలో కూడా ఈ మెయిల్స్ అడ్రస్‌లు కూడా ఇస్తున్నారు.

Visit and do complaint to:

  1. WWW.pmindia.gov.in
    (Prime Minister of India Office)
  2. WWW.mha.gov.in
    (Ministry of Home Affairs)
    Email: Jscpgmha@nic.in

ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌ కి ప్రభుత్వ పరంగా ఎలాంటి సెక్యూరిటీ లేదు. వ్యక్తిగత సెక్యూరిటీతోనే ఆయన తిరుగుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌ బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఏపీలో ఉన్న పరిస్థితుల కారణంగా అక్కడి అధికార పార్టీ నేతల తీరు, పోలీసుల వ్యవహార శైలి కారణంగా పవన్ కళ్యాణ్ కి ముప్పు ఉందన్న ఆందోళన ఎక్కువగా వినిపిస్తోంది. అధినేతకి ఏమైనా చేయాలంటే ముందు తమని దాటి వెళ్ళాలని తామే ఒక సైన్యంలా ఉండి తమ అధినేతని కాపాడుకుంటామని జనసైనికులు వీరమహిళలు తెగేసి చెపుతున్నారు. మొత్తంగా చూస్తే జనసేన అధినేత త్వరలో మొదలు పెట్టనున్న బస్సు యాత్రకి ప్రభుత్వం అడుగడుగునా ఆటకం కలిగించడంతో పాటు ఆయన భద్రత విషయంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయో అనే ఆందోళన ఒకపక్క క్యాడర్ నందు ఉంది, కానీ ఆయనకి తోడుగా నీడగా ఉండి తాము వేలమంది ఉన్నామని, ఆయనిని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటాం అనే ప్రతిజ్ఞ ప్రతి జనసైనికుడు, వీరమహిళ సోషల్ మీడియా సాక్షిగా చేస్తున్నారు. తాము ఉండగా జనసేన అధినేతకి ఎలాంటి ముప్పు రాదని ఘంటాపథంగా చెపుతున్నారు. జనసేన అధినేతకి అన్ని శుభాలు కలగాలని ఆయనకి ఓటు వేసి ఆయనను సిఎం పీఠం ఎక్కించి ప్రజలకి మేలు చేయాలని మనమూ కోరుకుందాం.