చిలకపాలెం – పెద్దకొత్తపల్లి రోడ్డు పునరుద్ధరించాలని జనసేన డిమాండ్

శ్రీకాకుళం జిల్లా, లావేరు, ఎచ్చెర్ల, పొందూరు మండలాలకు ఎంతో కీలకమైన చిలకపాలెం – పెద్దకొత్తపల్లి రోడ్డుపై ప్రయాణ కష్టాలు ఇంకా ఎన్నాళ్లు భరించాలని అని జనసేన పార్టీకి చెందిన లావేరు మండల నాయకులు పెద్దకొత్తపల్లి పంచాయతీ కి చెందిన కాకర్ల బాబాజీ మరియు ఆయా గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిత్య నరకం, ఒళ్ళు హూనం అన్న చందంగా తమ పరిస్థితి ఉందని ఈరోజు తెలియజేసారు. మూడు మండలాలకు చెందిన సుమారు 12 గ్రామాల ప్రజలు ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తుండగా… రోడ్డు పొడవునా గోతులతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడే సమయంలో గోతుల్లో నీరు నిలిచి వాహనదారులు, ప్రయాణికులు పడే కష్టాలు చాలా దారుణంగా ఉన్నాయని తెలియజేశారు. అలాగే విద్యార్థులకు రవాణా సౌకర్యాలు రోడ్లు గుంతలు మయంగా ఉండడం వల్ల బస్సులు కూడా రావటం లేదని తెలియజేశారు. ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఈ రోడ్లు వేయాలని కోరారు.