తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన జనసేన

పాయకరావుపేట, నక్కపల్లి మండలం, రాజయ్యపేటలో మైనర్ బాలికపై అత్యాచారం. నిన్న సాయంత్రం స్కూల్ వదిలిన తర్వాత అదే గ్రామానికి చెందిన గొడ్డు నాగేష్ (21) యువకుడు గ్రామానికి దూరంగా ఉన్న జీడితోట లోకి తీసుకువెళ్లి బాలికపై విచక్షణారహితంగా నాలుగు సార్లు లైంగిక దాడికి పాల్పడి, ఇంట్లో ఉన్న స్త్రీలందరి నగ్న వీడియోలు తీయాలని చెప్పి రాత్రి 9 ప్రాంతంలో బాలికను దూరంగా విడిచి, ఎవరికి చెప్పినా చంపేస్తానని బెదిరించిన కామాంధుడు. విషయం తెలిసిన వెంటనే స్పందించిన రాజయ్యపేట జనసేన పార్టీ మరియు పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి, నక్కపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన జనసేన పార్టీ మరియు రాజయ్యపేట గ్రామ పెద్దలు, కేస్ నమోదు చేసిన పోలీసులు.