ఇది రైతు ప్రభుత్వం కాదు – రైతు దగా ప్రభుత్వం: నూజివీడు జనసేన

నూజివీడు, మండల తహసిల్దార్ కి మండలంలో రైతులు పడుతున్న కష్టాల గురించి జనసేన నూజివీడు మండల అధ్యక్షులు యర్రంశెట్టి రాము ఆధ్వర్యంలో వివరించి, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నూజివీడు నియోజకవర్గం నాయకులు మరీదు శివరామకృష్ణ మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలనీ… కొనుగోలు చేసిన దాన్యంకు సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లో వెయ్యాలనీ… అకాల వర్షాలు మరియు చీడ పురుగులు వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలనీ… విత్తనాలు, ఎరువుల ధరలను మరియు నాణ్యతను ప్రభుత్వ బాధ్యత వహించి నియంత్రించాలనీ డిమాండ్ చేశారు. ఇది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఆచరణలో రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రైతు దగా ప్రభుత్వంగా మారిందని అన్నారు. పై సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని లేకపోతే రైతుల పక్షాన, అండగా ఉండి అన్నం పెట్టే రైతు కోసం జనసేన పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నూజివీడు నియోజకవర్గం నాయకులు ముత్యాల కామేష్, తోట వెంకట్రారావు, ఏనుగుల చక్రి, ఎం సునీల్ కుమార్, ఇంటూరి చంటి, యాధల వెంకట్, యుస్మార్ట్ ఉమ, నిట్ల ఉమామహేశ్వరి, కొన్నంగుట రాంబాబు, చెన్నా, గస్సి రాము తదితరులు పాల్గొన్నారు.