హరీష్ షాపుపై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని జనసేన డిమాండ్

గూడూరు మండలం తలకుటూరు గ్రామంలో గల్లా హరీష్ అనే జన సైనికుడుకి పాల డైరీ షాపు ఉంది. తను లేని సమయంలో హరీష్ తండ్రి పాండు రంగారావు షాపు బాధ్యతలు చూసుకుంటారు. ఈనెల 18వ తేదీన అదే గ్రామానికి చెందిన గల్లా కిరణ్, గల్లా రత్తయ్య, గల్లా హనుమంతరావు ముగ్గురు వ్యక్తులు హరీష్ తండ్రిపై దాడి చేసి గాయపరచి, అతని షాపును ధ్వంసం చేయడం జరిగింది. ఈ సంఘటనలో ఒక బంగారు గొలుసు, కొంత నగదు పోవడం జరిగింది. ఈ విషయంని గూడూరు పోలీసువారికి అదేరోజు సాయంత్రం ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీస్ వారు వచ్చి ప్రాథమిక విచారణ చేశారు. మరుసటి రోజు 19-05-2022 న ఎఫ్ ఐ ఆర్ నెంబర్ 223/2022 తో కేసు నమోదు చేయడమైనది. కానీ ఇప్పటివరకు పోలీసు వారు దాడి చేసిన వ్యక్తుల పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా ముగ్గురు వ్యక్తులు ఊర్లోనే తిరుగుతూ, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అని, కొన్ని రోజుల తర్వాత సెక్షన్లు మార్చి కేసును తారుమారు చేయించగల వ్యక్తులు మా వెనకాల ఉన్నారని చెప్పుకుంటూ ఊర్లో తిరుగుతున్నారు. ఈ కేసు విషయంలో మాకు పలు అనుమానాలు కలుగుతున్నాయి. కారణం పోలీసు వారు ఇప్పుటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవటమే. నిజంగానే కేసు నీరుగార్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా గూడూరు ఎస్సై తక్షణమే స్పందించి దాడి చేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని చట్టపరమైన తగు చర్యలు తీసుకోవాలి. లేనియెడల జనసేన పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులతో సంప్రదించి మా కార్యాచరణ మేము రూపొందిస్తాం. త్వరలోనే ఈ విషయంపై ఎత్తున ఉద్యమం చేపడతామని పెడన జనసేన నాయకులు ఎస్ వి బాబు అన్నారు.