ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తుల నిరసనకు కుప్పం జనసేన మద్ధతు

కుప్పం నియోజకవర్గ పరిధిలోని ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తుల నిరసన కార్యక్రమానికి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేసింది. ద్రావిడ విశ్వవిద్యాలయంలో దాదాపు 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు దాదాపు మూడు నెలలు నుండి జీతాలు ఇవ్వకుండా వారి యొక్క భవిష్యత్తు అయోమయ పరిస్థితిలో ఉన్నందున ఉద్యోగస్తులు అందరూ కలిసి గత నాలుగు రోజులుగా నిరసన కార్యక్రమం చేపడుతున్నందున జనసేన పార్టీ నాయకులు అక్కడి ఉద్యోగస్తుల సమస్యలను తెలుసుకొని వారి యొక్క సమస్యలనుపై విద్యాలయం విసీతో చర్చించి వారి యొక్క సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా జనసేన పార్టీ ఉద్యోగస్తులను యూనివర్సిటీ ఉద్యోగస్తులుగా పరిగణలోకి తీసుకోవాలనే పోరాటానికి మద్దతు తెలిపి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామమూర్తి, సంయుక్త కార్యదర్శులు వేణు, మునెప్ప, రాష్ట్ర మత్స్యకార కార్యవర్గ సభ్యులు వామనమూర్తి, జిల్లా ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు నవీన్, మండల అధ్యక్షులు అమీర్, హరీష్, మరియు నాయకులు భాస్కర్, నవీన్, హంసగిరి, మంజునాథ్, అరవింద్, సౌందర్ రాజ్, ప్రకాశ్, మణి, మూర్తి మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.