మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించాలని జనసేన డిమాండ్

మార్కాపురం, జిల్లా సాధన పోరాట సమితి (జెఏసి) పశ్చిమ ప్రాంతమైన మార్కాపురాన్ని జిల్లా కాకుండా అడ్డుకొని ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిన వైసీపీ ప్రభుత్వనికి వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో జేఏసీ వైస్ చైర్మన్ మరియ జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాధ్ భారీ జనసందోహంతో మార్కాపురం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి నాలుగు మండపాలు చుట్టూ ర్యాలీగా తిరుగుతూ కోర్ట్ సెంటర్ వద్ద కూడలిగా ఏర్పడి నినాదాలు చేస్తూ ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం దగ్గర ఇమ్మడి కాశీనాధ్ మీడియాతో మాట్లాడుతూ… కేవలం కొందరు వ్యక్తుల రాజకీయ స్వార్ధం కోసం మార్కాపురం జిల్లా కాకుండా అడ్డుకున్నారని రాబోవు కాలంలో ప్రజలు ఈ పశ్చిమ ప్రాంత మార్కాపురం డివిజన్ పరిధిలోని వైసిపి శాసనసభ్యులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తెలియజేశారని, మార్కాపురం జిల్లా సాధనకై చేస్తున్న నిరహారదీక్షలు, ర్యాలీలు రాష్ట్ర ప్రభుత్వం గమనించకుండా మొండి వైఖరిగా ప్రవర్తిస్తుందని, మిమ్మల్ని నమ్మి ఓటు వేసిన ప్రజలను గుడ్డివారిని చేసి వారి జీవితాలతో చలగాటం ఆడుకుంటున్నారని, ఎన్ని ఉద్యమాలు జరిగినా స్థానిక వైకాపా నాయకులు దీక్షలను భగ్నం చేయడం, ర్యాలీలను అడ్డుకోవడం, ఈ పశ్చిమ ప్రకాశ ప్రాంతం యొక్క అభివృద్ధికి ఆటంకం కలిగించడం చేస్తున్నారని, ఈ పశ్చిమ ప్రాంతానికి గతంలో రావాల్సిన నాగార్జున సాగర్ కెనాల్ ని ఈ ప్రాంత నాయకుల నిర్లక్ష్యం వలన కోల్పోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి ఎన్.వి సురేష్, మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్ , తర్లుపాడు మండల అధ్యక్షులు చేతుల శ్రీనివాసులు, పొదిలి మండల అధ్యక్షులు పేరిసోముల శ్రీనివాసులు, కొనకలమిట్ల మండల అధ్యక్షులు అన్నం ప్రభావతి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సుదర్శన్, జిల్లా ప్రోగ్రాం కమిటి సభ్యులు వీరిశెట్టి శ్రీనివాసులు, ఇమ్మడి నాగ సుందరి, పిన్నెబోయిన లక్ష్మీ రాజ్యం, పూజ లక్ష్మీ, సువర్ణ, పిన్నెబోయిన శ్రీను, వెంకటయ్య, భారతి, శీరిగిరి శ్రీను, సంగటి వెంకటేశ్వర్లు, శేఖర్, రఫీ, జానకి రామ్, షరీఫ్, ఫణి, పోటు వెంకటేశ్వర్లు, ఖాజా వలి, రామిరెడ్డి, పుల్లయ్య, జనసేన వీర మహిళలు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.