బడ్డీకొట్ల తొలగింపు కార్యక్రమం ఆపాలని జనసేన డిమాండ్

*జనసేన పార్టీ విద్యార్థి విభాగం డిమాండ్
*బోనకల్ లో బడ్డీకొట్లే జీవినోపాధిగా చేసుకొని బ్రతుకుతున్న వారి బడ్డీకొట్లను ఏ అవసరం లేకుండా తొలగించడం అన్యాయం.
*ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగ కార్యనిర్వహక సభ్యుడు గంధం ఆనంద్

ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని బ్రిడ్జ్ కింద ఉన్న బడ్డీకొట్ల తొలగింపు వాళ్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. పేదలు బడ్డీలు పెట్టుకొని వల్ల జీవనాన్ని కొనసాగిస్తూ బ్రతుకుతున్నారు. బడ్డీకొట్ల చిరువ్యాపారుల బ్రతుకులు ఛిద్రం వారి ఆందోళనలు లెక్క లోనికి తీసుకోలేదు అర్జీలు పరిష్కరించలేదు వారి తరపున వచ్చిన రెప్రజన్టేషన్స్ ను ఖాతరు చేయలేదు ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించకుండా చిరు వ్యాపారులు. -ఆడా మగా బ్రతుకుతూ కుటుంబాలను పోషించుకుంటూ వారిబిడ్డలను చదివించుకొంటూ వృద్ధాప్యంలోవున్న వారి తల్లిదండ్రుల ఆలనాపాలనా చూసుకుంటూ ఆరోగ్యాలను కాపాడకుంటూ రేయింబవళ్లు బడ్డీకొట్లల్లో కష్టపడి బ్రతుకీడుస్తున్నారు .అట్లాంటి వారిని వాళ్ళు జీవనోపాధి కొనసాగించుకోకుండా ప్రభుత్వం చేస్తుంది. ఎప్పుడు గుర్తు రాని బడ్డి కొట్లు తొలగింపు ఈరోజు గుర్తువచ్చిందా అని ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగ కార్యనిర్వహక సభ్యుడు గంధం ఆనంద్ జనసేన పార్టీ తరుపున నుంచి డిమాండ్ చేస్తున్నానని అన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఆలోచనలు రావు కానీ పేద వారు చిన్న వ్యాపారాలు చేసుకుంటుంటే వాళ్ళని బ్రతకనియకకుండా బడ్డిలు తొలగింపు చేస్తున్నారు. ఈ బడ్డీ కొట్లు తొలగింపు ఆపాలని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ బడ్డీ కొట్లు తొలగింపు ఆపకపోతే నిరసనలు చేస్తాం అని జనసేన పార్టీ విద్యార్థి విభాగం నుంచి డిమాండ్ చేస్తున్నాం..అంతే కాకుండా బోనకల్ లో కూరగాయల మార్కెట్ ను అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నామని కుడా అన్నారు.