వృద్ధ దంపతులకు రేకుల షెడ్డు ఇంటిని నిర్మించి ఇచ్చిన గుడివాడ జనసేన

ప్రతి పేదవాడికి అండ జనసేన జెండా: సందు పవన్

గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో షేక్ బాజీ రహిమున్నిస వృద్ధ దంపతులు నివాసం ఉంటూ టెంట్ హౌస్ లో రోజువారి కూలిగా చేసుకుని జీవనం సాగిస్తున్న భర్త బాజీకి కొంతకాలం క్రితం నోటి కేన్సర్ రావడంతో ఉపాధి కోల్పోయి నిలువ నీడలేని సంగతిని స్థానిక గ్రామస్తులు ఎవరు పేద దంపతులకి అద్దెకి ఇల్లు ఎవరు ఇవ్వకపోవడం విషయాన్ని స్థానిక జనసేన పార్టీ దృష్టికి రావడంతో స్థానిక జనసేన పార్టీ నాయకులు తూము వెంకటరత్నం గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సందు పవన్ కి విషయం తెలియపరచగా తక్షణం స్పందించి 40 వేల రూపాయలతో వృద్ధ దంపతుల వారి సొంత స్థలంలో రేకుల షెడ్డు ఇంటిని నిర్మించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు సందు పవన్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జిల్లా అధ్యక్షులు బండిరెడ్డి రామ్ సూచన మేరకు స్థానిక నాయకులతో కలిసి 40 వేల రూపాయలతో రేకుల షెడ్డు ఇంటి నిర్మించడం చాలా సంతోషంగా ఉందని… రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్న ప్రతి పేదవాడికి ఈ రోజున గుర్తొచ్చే పార్టీ జనసేన పార్టీ మాత్రమేనని నేడు మేము ఖర్చుచేసిన 40 వేల రూపాయలతో ఓటుకు వెయ్యి రూపాయల చొప్పున గడిచిన ఎన్నికల్లో 40 ఓట్లు కొనగలమని కానీ పేదవారికి సహాయం చేయటంలో వచ్చే తృప్తి ఓట్లు సీట్లు రాజకీయంలో రాదని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యమని ఈ సమస్యను తన దృష్టికి తీసుకు వచ్చి సదరు పేద కుటుంబానికి ఇంటి నిర్మాణం కోసం తనకు కూడా సహాయం చేసే అవకాశం కల్పించినందుకు స్థానిక జనసేన పార్టీ నాయకుడు తూము వెంకటరత్నం కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణజిల్లా కార్యదర్శి పేర్ని జగన్ మాట్లాడుతూ… జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పేదవారికి సహాయం చేయడం చాలా సంతోషకరమని ఈ సహాయ కార్యక్రమాల్లో తనకు కూడా పాలుపంచుకునే అవకాశం కల్పించడం చాలా ఆనందంగా ఉందని గుడ్లవల్లేరు మండలంలో ఏ కార్యక్రమం చేసినా జనసేన నాయకులు తూము వెంకటరత్నం ముందు వరుసలో ఉండే వ్యక్తని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వేణుతురుమిల్లి గ్రామ సర్పంచ్ కొప్పినేని శేషవేణి, షేక్ రబ్బానీ, బోల్ల త్యాగరాజు, గుడ్లవల్లేరు మండలం నాయకులు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.