రోడ్ల అధ్వాన్న స్థితిపై జనసేన డిజిటల్ పొరాటం

*#Good morning CM Sir

*నిద్రపోతున్న ముఖ్యమంత్రికి పాడైన రోడ్ల పరిస్థితి తెలిపి నిద్ర లేపడమే ఈ ప్రోగ్రాం లక్ష్యం

నూజివీడు: ఆంధ్రప్రదేశ్ రహదారుల దుస్థితిని తెలియచేసేందుకు జనసేన పార్టీ మరో కార్యక్రమం GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్ తో డిజిటల్ క్యాంపెయిన్
• జులై 15, 16, 17 తేదీల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు. శివ రామకృష్ణ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో రహదారులు కనీస మరమ్మతులు కూడా కాలేదనీ తెలిపారు. గాఢ నిద్రలో ఉన్న ముఖ్యమంత్రి గారిని నిద్ర లేపేందుకే GoodMorningCMSir కార్యక్రమం అని అన్నారు. డిజిటల్ క్యాంపెయిన్ లో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా కొన్ని ప్రాంతాలో పాల్గొంటారనీ అన్నారు. ఫోటోలు, వీడియోలు స్వయంగా డిజిటల్ మీడియాలో అప్లోడ్ చేస్తారనీ, GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్ తో రహదారుల దుస్థితిపై జనసేన వీర మహిళలు నాయకులు, జన సైనికులు ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేసే కార్యక్రమం.
• గ్రామాలు, మండలాల్లో రహదారుల దుస్థితిని మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్దాం అని ఈ ప్రోగ్రాం లొ జనసేన పార్టీ శ్రేణులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.