క్రియాశీలక కార్యకర్తల భీమా నిమిత్తం జనసేనాని కోటి రూపాయల విరాళం

హైదరాబాద్, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోటి రూపాయల విరాళాన్ని అందజేశారు. బుధవారం హైదరాబాద్ లోని కేంద్ర కార్యాలయంలో రూ.కోటి చెక్కును పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కి మరియు కోశాధికారి ఎ.వి.రత్నంలకు అందజేశారు. పార్టీ క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు, వారికి ప్రమాద భీమా చేయించే నిమిత్తం గత రెండు సంవత్సరాలుగా ఏటా రూ.కోటి చొప్పున విరాళాన్ని అందజేస్తున్న పవన్ కళ్యాణ్ మూడో ఏటా తనవంతుగా రూ.కోటి విరాళాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాలుపంచుకుంటున్న పార్టీ వాలంటీర్లకు అభినందనలు. కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్న జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను” అని అన్నారు.