పార్వతి నగర్ లో ఇంటింటికి జనసేన

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక మారంపల్లి, పార్వతి నగర్ లో ఇంటింటికి జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మనోగతం ప్తచురించిన పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. మారంపల్లి జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి జాకీర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆశయాలను, సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ ప్రజా కార్యక్రమాలను, జనవాణి, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు కుటుంబానికి లక్ష చొప్పున మొత్తం 30 కోట్లు బాధిత కుటుంబాలకు అందజేయటం మొదలైన అనేక జనసేన కార్యక్రమాల గురించి కాలనీ ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీర మహిళ షేక్ తార, జనసేన నాయకులు వంశీ, ముక్కన్న, మహేష్, మారుతి, చిరంజీవి మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది.