అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి అండగా జనసేన

తూర్పుగోదావరి జిల్లా, ఆలమూరు మండలం బడుగువాని లంక గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురైన అన్యం సత్యనారాయణ (సత్తిబాబు) కుటుంబాన్ని పరామర్శించి వారికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం 25 కేజీల బియ్యం మరియు నిత్యవసర సరుకులను అందజేసిన కొత్తపేట జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్. జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ తో పాటు ఆలమూరు మండల అధ్యక్షులు సూరపురెడ్డిసత్య, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల డేవిడ్ రాజు, గ్రామ ఎంపిటిసి పడాల నాగలక్ష్మి అమ్మీరాజు, చెముడులంక ఎంపిటిసి తమ్మన భాస్కర్ రావు, యెరుబండి ప్రసాద్, దూలం శ్రీను, కలిదిండి బాలకృష్ణ, సూరపురెడ్డి సాయి మరియు గ్రామ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.