జనసేన అభిమాని సూర్యప్రకాష్ జన్మదిన వేడుకలు

తాడేపల్లిగూడెం: జనసేన అభిమాని నక్క సూర్యప్రకాష్ జన్మదినం సందర్భంగా కేశవబట్ల విజయ్ మిత్రబృందం ఆధ్వర్యంలో స్థానిక యగర్లపల్లి వద్ద ప్రేమాలయం వృద్ద ఆశ్రమంలో బిర్యానీ పేకెట్ల వితరణ జరిగింది. ఈ సందర్భంగా సూర్యప్రకాష్ మాట్లాడుతూ.. నా జన్మదినాన్ని ప్రేమాలయం వృద్ద ఆశ్రమంలో జరగడం చాలా ఆనందంగా ఉంది అని మన సనాతన ధర్మంలో చెప్పినట్టుగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన చుట్టు ప్రక్కన ఉన్న కొంత మంది పేదల ఆకలి తీర్చడమే మన ధర్మమని మనకి బోధించింది అని అన్నారు. కేశవబట్ల విజయ్ మిత్రబృందంకు ధన్యవాదాలు తెలిపారు. కేశవబట్ల విజయ్ మాట్లాడుతూ స్నేహానికి, సమాజ సేవకు, మానవత్వానికి ప్రాధాన్యత ఇచ్చే మిత్రుడి జన్మదినం ప్రేమాలయంలో జరగడం హర్షణీమనీ మనం ఎలాంటి ఉన్నత స్థానంలో ఉన్నా కూడా మనచుట్టూ ఉన్న సమాజానికి మనకు చేతనయినా సహయం చెయ్యడమే మన బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో తుమరాడ చిన్న, మారిసెట్టి నరసింహ మూర్తి, గంధం గిరి, రామోజు సతీష్, సిద్దార్థ రాయ్, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.