వైకాపా నేతల్లో ‘జనసేన భయం’

*జనసేన ప్రభంజనాన్ని తట్టుకోలేకే విమర్శలు
*రైతు భరోసా యాత్ర పై అంబటి, గుడివాడ అమర్నాథ్ విమర్శలు సిగ్గు చేటు *మీ నీచ చరిత్ర ఆంధ్ర ప్రజలకు తెలుసు
*అత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు జనసేన అండ

*మూడేళ్ల జగన్‌ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం

*మీడియాతో జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్

ప్రకాశం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర పై వైకాపా పాలకులు విమర్శలు చేయడం సిగ్గు చేటని జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు, గుడివాడ అమర్ నాధ్ లు విమర్శలు చేయడం సరికాదని, వారి నిజ స్వరూపం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసని, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని విమర్శించారు. సోమవారం ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రియాజ్ మాట్లాడారు. వైకాపా అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం 2019 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అప్పుల బాధ తట్టుకోలేక చనిపోయిన కౌలు రైతుల కుటుంబాల్లో మనోధైర్యం నింపేందుకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్రకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రతీ జిల్లాలో చనిపోయిన కౌలు రైతు కుటుంబాలను ఓదారుస్తూ.. కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ యాత్రలో ప్రజల నుండి జనసేనకు వచ్చే ప్రజాదరణను చూసి ఓర్చుకోలేని రాష్ట్ర నీటి పారుదలశాఖామంత్రి అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ లు విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. అంబటి రాంబాబు చీకటి పడితే రాసలీల రాంబాబుగా అవతారమెత్తుతాడన్నారు. అలాంటి రాంబాబు పవన్ కళ్యాణ్ జీవితాన్ని బయోపిక్ తీయాలని విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దమ్ము ఉంటే పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారో బహిరంగంగా చెప్పాలని ప్రశ్నించారు. అంతే కాని ప్రతిపక్షం పై నోరు పారేసుకుంటే మర్యాదగా ఉండదని షేక్ రియాజ్ హెచ్చరించారు. మరో వ్యక్తి గుడివాడ అమర్ నాథ్ జీవితం గురించి అందరిని తెలుసు అన్నారు. వారి కుటుంబం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిందన్నారు. పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడని పదే పదే విమర్శలు చేయడం సరికాదన్నారు. మూడేళ్ళ జగన్‌ రెడ్డి పాలనలో రాష్ట్రానికి కాని, ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రం సర్వనాశనం అయ్యిందన్నారు. జగన్ రెడ్డి పాలనలో అప్పులు బాధ తప్పుకోలేక చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకు జనసేన అండగా నిలుస్తుంటే, అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం ఎంత వరకు సబాబు అన్నారు. ప్రజలంతా చూస్తున్నారని, 2024లో జనసేన గెలుపును ఎవ్వరు ఆపలేరని వైకాపాకు స్పష్టంగా అర్దమైయ్యిందన్నారు. అందుచేతనే జనసేనపై పాలకులు విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు, కార్పొరేటర్ మలగా రమేష్, ప్రకాశం జిల్లా కార్యదర్శులు కళ్యాణ్ ముత్యాల, రాయని రమేష్ తదితరులు పాల్గొన్నారు.