రైతుకూలీ గృహనిర్మాణానికి జనసేన ఆర్థిక సహాయం

గిద్దలూరు జనసేన పార్టీ ఇంచార్జ్ బెల్లంకొండ సాయిబాబు ఆదేశాల మేరకు అర్ధవీడు మండలం కాకర్ల గ్రామంలో వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్న కొండూరి వెంకటేశ్వర్లుకు సొంత గృహం లేకపోవడంతో చిన్నపాటి సొంత గృహం ఏర్పాటు చేసుకొనుటకు జనసేన పార్టీ తరఫున ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి కాల్వ బాల రంగయ్య అర్ధవీడు మండలం అధ్యక్షుడు కలగట్ల అల్లూరయ్య నందిపాటిరంగనాయకులు కొల్లిబోయిన వెంకటేశ్వర్లు గుంటూరు నారాయణ పాల్గొనడం జరిగింది.