అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి జనసేన ఆర్ధికసాయం

కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం, చల్లపల్లి మండలం, చల్లపల్లి నారాయణరావు నగర్ కాలనీలోని రంగుల పైడయ్య సతీమణి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని జనసేన పార్టీ చల్లపల్లి మండలం తరుఫున ఆ కుటుంబానికి 5,500 రూపాయలు సాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా పైడయ్య సతీమణి ఆరోగ్యం తొందరగా మెరుగు అవ్వాలని జనసైనికులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి ఉస్మాన్ షరీఫ్, మండల ఉపాధ్యక్షుడు మల్లంపల్లి నాంచారయ్య, మండల పార్టీ ఉపాధ్యక్షుడు బొందలపాటి వీరబాబు, చల్లపల్లి టౌన్ అధ్యక్షులు ముత్యాల ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి మిరియాల జితేంద్ర, మండల కార్యదర్శి సోమిశెట్టి రాఘవ, మండల కార్యదర్శి బెల్లపు ప్రసాద్, అవనిగడ్డ నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ సూదాని నందగోపాల్, పసుపులేటి రవికుమార్, మునిపల్లి భాను, పసుపులేటి సుందర శ్రీను, కనపర్తి సాయి, బెజవాడ సత్యనారాయణ, యమ్.బాబి, ఉప్పల నాంచారయ్య, ఉస్మాన్, లుక్కా శేషు, మంగళగిరి కిషోర్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.