క్యాన్సర్ బాధితురాలికి జనసేన ఆర్ధికసాయం

ఇచ్చాపురం నియోజకవర్గం: జనసేన పార్టీ కమలై పుట్టుగ గ్రామ జనసైనికులు ఇచ్చాపురం మున్సిపాలిటీలో గత కొద్ది నెలలుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఎన్. శ్యామల దేవి(వయసు 28 సంవత్సరములు) విషయం జనసేన పార్టీ దృష్టికి రావడంతో ఇంత చిన్న వయసులోనే క్యాన్సర్ వ్యాధి గురి కావడం చాలా బాధాకరమైన విషయంగా భావించి బుధవారం ఉదయం జనసేన పార్టీ సమన్వయకర్త దాసరి రాజు మరియు రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తిప్పన దుర్యోధన రెడ్డి, సమక్షంలో కమలై పుట్టుగ జనసైనికులు 6000 రూపాయలు ఆర్థిక సహాయం చెయ్యడం జరిగింది. అదేవిధంగా మరి కొంతమంది దాతలు వచ్చి ఆర్థికసహాయం చేసి శ్యామల ప్రాణాన్ని కాపాడ వలసిందిగా పిలుపునిచ్చారు.