జనసేన జెండా – విద్యార్థుల అండ

కాకినాడ అచ్చంపేట సెంటర్ ఎం.ఎస్.ఎన్ పిజి కాలేజీ ప్రాంతం వద్ద 2002 లో ఆనాటి కలెక్టర్ కాలేజీకి ఇచ్చిన స్థలాన్ని ప్రభుత్వం తిరిగి తీసుకుని దానిని వైస్సార్ పార్టీ కార్యాలయం కట్టుకునేందుకు ఇస్తున్న ప్రాంతాన్ని కాకినాడ రూరల్ జనసేన నాయకులు మరియు బీజేపీ నాయకులు, విద్యార్థులతో కలిసి పరిశీలించి, కాలేజీ వద్ద రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ మరియు బీజేపీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు చిలుకూరి రాంకుమార్. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు మరియు విద్యార్ధులు పాల్గొనడం జరిగింది.