కేశవ కుప్పం పంచాయతీలో జనం కోసం జనసేన

  • పవన్ కళ్యాణ్ కు ఒక్క అవకాశం ఇవ్వండి
  • గాజు గ్లాసు గుర్తుకు ఓటేయ్యండి
  • కేశవ కుప్పాన్ని ఆదర్శ పంచాయితీ చేస్తాం
  • జనసేన ఇన్చార్జి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి స్రవంతి రెడ్డి

గంగాధర నెల్లూరు నియోజకవర్గం: కార్వేటి నగరం మండలం, కేశవ కుప్పం పంచాయతీలో జనం కోసం జనసేన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్న సతీమణి స్రవంతి రెడ్డి పాల్గొన్నారు. జీలా వారి కండ్రిగ, కేశవ కుప్పం గ్రామంలో పర్యటించారు. ప్రతి ఇంటిని సందర్శించి భవిష్యత్తు గ్యారంటీలోని అంశాలను వివరించారు. ఈ సందర్భంగా స్రవంతి రెడ్డి మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో నిస్వార్థ సేవా తత్పరత కలిగిన మహోన్నత మూర్తి, త్యాగశీలత, సచ్చీలత కలిగిన దేశభక్తిపరుడు, ప్రజల కోసమే జీవితాన్ని త్యాగం చేస్తున్న ప్రజా సేవకుడు పవన్ కళ్యాణ్ కు ఒక్క అవకాశం ఇవ్వండి అని విజ్ఞప్తి చేశారు. అమరావతి రాజధానిగా ఉంటూ, అద్భుతమైన పరిపాలన అందించగలిగిన శక్తిమంతుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. జన రంజక పాలన వస్తుందని, జన హితఒకోసమే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారని, తన ప్రయోజనం కంటే రాష్ట్ర ప్రయోజనమే ముఖ్యమని సూపర్ సిక్స్ తో మరో సూపర్ సిక్స్ కలిసిందని ఉద్ఘాటించారు. అందుకే గాజు గ్లాస్ కి ఓటేయండి అని ప్రతి ఒక్కరికి మనవి చేశారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ జనసేన ఆదరించాలని, గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా ప్రజాసేవకే తన జీవితాన్ని త్యాగం చేసి, ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేసి ప్రతిఫలం ప్రజలకు అందించిన నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ పొన్న యుగంధర్ ను ఆదరించాలని, గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్వేటి నగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, కార్వేటి నగరం మండల బూత్ కన్వీనర్ సురేష్ రెడ్డి, నియోజకవర్గ యువజన కార్యదర్శి అన్నామలై, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, నరేష్, నియోజకవర్గ కోఆర్డినేటర్ జైపాల్ రాజు, మండల ప్రధాన కార్యదర్శి రుద్ర, మండల కార్యదర్శి నాగార్జున, కేశవ కుప్పం పంచాయతీ అధ్యక్షులు తిరుమలేష్, కార్వేటి నగరం మండల బీసీ సెల్ అధ్యక్షులు దేవా, కాపు యువసేన మండల అధ్యక్షులు వెంకటేష్ పాల్గొన్నారు.