అవనిగడ్డ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో జనం కోసం జనసేన

  • జనం కోసం జనసేన 11వ రోజు

అవనిగడ్డ నియోజకవర్గం: అవనిగడ్డ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో అవనిగడ్డ నాలుగో వార్డ్ నందు జనం కోసం జనసేన కార్యక్రమం 11వ రోజు కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి జనసేన పార్టీని మరింత లోతుగా తీసుకెళ్లడం తద్వారా పవన్ కళ్యాణ్ గారు ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని అవనిగడ్డ టౌన్ అధ్యక్షుడు రాజనాల వీరబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అవనిగడ్డ టౌన్ ప్రజలకు బ్రహ్మ రధం పడుతూ.. ఈసారి తప్పనిసరిగా జనసేన పార్టీని గెలిపించుకోవడమే ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ టౌన్ కమిటీ సభ్యులతో పాటు అవనిగడ్డ జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శులు బచ్చు శ్రీహరి, భోగి రెడ్డి నాగేశ్వరావు ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ టౌన్ అధ్యక్షుడు రాజనాల వీరబాబు, అవనిగడ్డ కమిటీ ఉపాధ్యక్షులు ఆళ్ళమళ్ళ చందు బాబు,
అవనిగడ్డ గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి అన్నపరెడ్డి ఏసుబాబు, తోట శ్రీను, తదితర జనసైనికులు, వీరమహిళలు పాల్గొని కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు.