వైసీపీ నాలుగేళ్ళ పాలనలో ప్రజల జీవన విధానం చిన్నాభిన్నం

  • సమస్యలపై జనసేన సమరభేరికి విశేష స్పందన
  • సమస్యల సుడిగుండంలో నగర ప్రజానీకం
  • వైసీపీ పాలనపై క్షేత్రస్థాయిలో నెలకొన్న ఊహించని ప్రజావ్యతిరేకత
  • జనసేన నాయకుల ముందు సమస్యలను ఏకరువు పెట్టిన ప్రజలు
  • సమస్యల పరిష్కారనికై కృషి చేస్తామని జనసేన నేతల హామీ
  • రాష్ట్ర భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ కు అవకాశం ఇవ్వాలని ప్రజల్ని కోరిన గుంటూరు నగర అధ్యక్షులు నేరేళ్ళ సురేష్ ,

గుంటూరు: గుంటూరు నగరంలో 9వ డివిజన్ అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ ఆధ్వర్యంలో జనంలోకి జనసేన జనం కోసం జనసేన సమస్యలపై సమరభేరి కార్యక్రమంలో ఆదివారం ఉదయం స్థానిక పాత గుంటూరు నందు శ్రీ ఆంజనేయస్వామి గుడి దగ్గర నుండి ముందుగా పూజా కార్యక్రమాల నిర్వహించి, స్థానిక ప్రజల్ని కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు.. కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ వైసీపీ నాలుగేళ్ళ పాలనలో ప్రజల జీవన విధానం చిన్నాభిన్నం అయ్యిందని, నగర ప్రజలు సమస్యల సుడిగుండంలో చిక్కుకొని నరకయాతన పడుతున్నారని దోపిడీలు, దౌర్జన్యాలు, హత్యలు, కిడ్నాప్లు పెరిగినవి అని నేరేళ్ళ సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు చింత రేణుక రాజు, కొండూరు కిషోర్ కుమార్, ప్రధాన కార్యదర్శులు, ఎడ్ల నాగమల్లేశ్వరరావు, సూరిశెట్టి ఉపేంద్ర, కటకం శెట్టి విజయలక్ష్మి, నగర కార్యదర్శిలు, సంయుక్త కార్యదర్శులు, 9వ డివిజన్ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్, నగర కార్యదర్శి బొమ్మకంటి కవిత, నగర సంయుక్త కార్యదర్శి బొందిలి నాగేంద్ర సింగ్, పలు డివిజన్ అధ్యక్షులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.