డివిజన్ కేంద్రంలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు వేగవంతం చేయాలి

  • జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు గాదె పృథ్వి

జనగామ జిల్లా, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం, వచ్చే విద్యాసంవత్సరానికి డివిజన్ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు గాదె పృథ్వి డిమాండ్ చేసారు. రెండు దశబ్దాలుగా స్థానిక విద్యార్థుల సమస్య డిగ్రీ కాలేజ్ ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని మంగళవారం ఆర్డివోకు వినతిపత్రం అందజేశారు. మరో నెలరోజుల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు పై చదువుల కోసం హన్మకొండ, జనగామ ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు.దూర ప్రాంతాలకు వెళ్లలేక చదువు ఆపేసే దుస్థితి నెలకొందని తెలిపారు.మూడు నెలల క్రితం సీఎం కెసిఆర్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన కూడా నేటికీ ఎలాంటి ముందడుగు లేదన్నారు. ప్రభుత్వం మాటలకే తప్పా చేతల్లో నత్తడుగులే అని ఏద్దేవా చేసారు.ఇచ్చిన మాట నిలబెట్టుకొని వెంటనే డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక విద్యార్థుల ఆకాంక్ష మేరకు తాత్కాలిక భవనం పరిశీలించి ఈ విద్యాసంవత్సరం నుండి డిగ్రీ కాలేజ్ ఏర్పాటుకు ఎమ్మెల్యే చొరువా చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మహమ్మద్ రజాక్, మునిగేలా పవన్, బషీర్, విజయ్, చింటూ, రాకేష్ తదితరులు ఉన్నారు.