జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను జయప్రదం చెయ్యండి: బండ్రెడ్డి రామ్

కృష్ణ జిల్లా, ఈ నెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా కృష్ణ జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ మండల అధ్యక్షుల సమావేశం ఏర్పాటు చేసారు. జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామ్ మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గం నుండి జనసేన శ్రేణులు తరలిరావాలని సభని జయప్రదం చెయ్యాలని.. అందుకు కావలసిన సహాయ సహకారాలు అందజేస్తా అని తెలిపారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మరియు వాలంటీర్ ఇన్ ఛార్జ్ ఆకేపాటి సుభాషిణి మాట్లాడుతూ.. అన్ని నియోజక వర్గాలనుండి వాలంటీర్లు రేపు ఉదయం 10 గంటలకు ఆధార్ జిరాక్స్ మరియు పాస్ పోర్ట్ సైజు ఫోటో తో పార్టీ ఆఫీస్ కి చేరుకోవాలని కోరారు.