రాజ్యాంగ నిర్మాతకు నరసాపురం జనసేన ఘననివాళి

నరసాపురం, డా.బి.ఆర్.అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పిఏసి సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మన్ బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో, నరసాపురం టాక్సీ స్టాండ్ సెంటర్ మరియు మొగల్తూరు గాంధీ బొమ్మ సెంటర్లలో అంబేడ్కర్ విగ్రహాలకు నరసాపురం నియోజకవర్గ జనసేన శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వృద్ధులకు మరియు వికలాంగులకు పండ్లు, కూల్ డ్రింకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆకన చంద్రశేఖర్, కొల్లాటి గోపికృష్ణ, వలవల నాని, వట్టిప్రోలు సతీష్, యడ్లపల్లి మహేష్, దొడ్డా జగన్, తోట నాని, తోట అరుణ, బొమ్మిడి సూర్యకుమారి, కొప్పాడి కృష్ణవేణి, బొమ్మిడి కృష్ణమూర్తి, పోలిశెట్టి గణేశ్వరరావు, కటకంశెట్టి సాయి, ఉప్పులూరి రాంబాబు, పోలిశెట్టి సాంబ, అయితం చిన్ని, గాది రవి, మీసారపు నిఖిల్, మీసారపు నాగబాబు, గ్రంధి నాని, గన్నబత్తుల ప్రసాద్, యాతం మహేష్ మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు మరియు వీరమహిళలు పాల్గొన్నారు.