రంగాపురం గ్రామంలో ఇంటింటికి జనసేన

భద్రాద్రి కొత్తగూడెం: అన్నపురెడ్డిపల్లి మండలం, రంగాపురం గ్రామంలో జనసేన పార్టీ ఆర్గనైజర్ సెక్రెటరీ తాళ్లూరి పవన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటికి జనసేన కార్యక్రమంలో భాగంగా సోమవారం జనసేన పార్టీని జనంలోకి తీసుకెళ్తూ, పార్టీని మరింత బలాపేతం చేయడానికి ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నేతలు మాట్లాడుతూ జనసేన పార్టీ ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి పవన్, ఎగ్జిక్యూటివ్ మెంబెర్ చల్లా రాజు, గుంజి వెంకన్న, అంజి బత్తుల రాము, తమ్మిశెట్టి రంగారావు, తాళ్లూరు రాంబాబు, ముఖ్య నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.