“నిజం గెలవాలి” కి జనసేన సంపూర్ణ మద్దతు

  • చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల కలయిక రాష్ట్రానికి ఎంతో అవసరం
  • చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో భేటీలో ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల కలయిక రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. మంగళవారం ఆయన నారావారిపల్లెలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చాయి. బుధవారం నుంచి భువనేశ్వరి చేపట్టనున్న “నిజం గెలవాలి” కార్యక్రమానికి జనసేన సంపూర్ణ మద్దతు ఇస్తోందన్నారు. చంద్రబాబు చేయని తప్పుకు కేసులో ఇరికించారన్నారు. జనసేన-టిడిపికి ప్రజల నుంచి మద్దతు ఉందని తెలిపారు. దేవుడితో పాటు ప్రకృతి కూడా జనసేన-టిడిపి కూటమికి అనుకూలంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో రెండు పార్టీల సమన్వయంతో ఉమ్మడి పోరాటం చేస్తామన్నారు. జనసేన రాష్ట్ర, జిల్లా కమిటీల ప్రతినిధులు కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని నారా భువనేశ్వరికి తెలిపారు. జనసేన మద్దతుపై భువనేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలపై ఉమ్మడి పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.