పెండ్యాలలో పవన్ కళ్యాణ్ ఫొటొకు పాలాభిషేకం

నందిగామ నియోజకవర్గం: కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామంలో బుధవారం భాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధి కంచికచర్ల మండల అధికార వైకాపా పార్టీ ఎంపీపీ మలక్ బషీర్ ఊరి గ్రామ వార్డు మెంబర్లతో జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్ర పటాన్ని అత్యంత హేయంగా సభ్య సమాజం తల దించుకునే విధంగా చెప్పులతో కొట్టించి, చిత్ర పటాన్ని తగలబెట్టడం విదితమే. ఈ సంఘటనపై నియోజకవర్గ పార్టీ కంచికచర్ల మండల కేంద్రంలో గురువారం భారీ నిరసన ర్యాలీ చేసి సదరు అధికార పార్టీ ఎంపిపి 24 గంటల లోగా క్షమాపణ చెప్పవలసిందిగా డిమాండు చేయగా అధికార పార్టీ అండ చూసుకుని చేసిన దుశ్చర్యకు తాను క్షమాపణ చెప్పక పోగా అధికార వైకాపా పార్టీ కూడా చర్యను సమర్థించే విధంగా పోకడలు పోయింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ జనసేన శ్రేణులు పెండ్యాల గ్రామ పార్టీ కార్యకర్తలు ఎక్కడ అయితే ఆయనకు అవమానం జరిగిందో అదే పెండ్యాల సెంటర్ కు శనివారం ర్యాలీగా చేరుకుని పవన్ కళ్యాణ్ జిందాబాద్ అని నినాదాలు చేస్తూ ఆయన చిత్ర పటానికి 10 లీటర్ల పాలతో పాలాభిషేకం చేసి ఆ ప్రాంతాన్ని పాల మయంగా ముంచెత్తారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు పూజారి రాజేష్ మాట్లాడుతూ భాధ్యత కలిగిన అధికార పార్టీ ఎంపిపి చేసినది అత్యంత హేయమైన చర్య అధికార వైకాపా పార్టీ తప్ప దీనిని ఎవరూ సమర్ధించరని ఇది గ్రామాలలో అలజడి సృష్టించి పబ్బం గడుపుకోవలని చూస్తున్నారని దీనిని నియోజకవర్గ వ్యాప్తంగా తిప్పి కొడతామని తెలియజేస్తూ తాము ఏనాడూ జగన్ బొమ్మలను కానీ చంద్ర బాబు, ఇతర పార్టీ ల నాయకులను కించపరిచే విధంగా నడుచుకొలేదని అటువంటి దిక్కు మాలిన రాజకీయాలు అసలు చేయలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిగామ పట్టణ 20 వార్డు కౌన్సిలర్ తాటి వెంకట కృష్ణ, నియోజక వర్గ నాయకులు పూజారి రాజేష్, కంచికచర్ల మండల పార్టీ అధ్యక్షుడు నాయిని సతీష్, వీరులపాడు మండల అధ్యక్షులు బేతపూడి జయరాజు, నందిగామ పట్టణ వీర మహిళా విభాగం అధ్యక్షురాలు మేకపోతుల శ్రీ లక్ష్మి యాదవ్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, పెండ్యాల గ్రామ పార్టీ కార్యకర్తలు మెహబూబ్ అలీ, గౌస్ బాషా, షకీర్, అక్రమ్, ఆసిఫ్, అబ్దుల్ కరీం, ఇంతియాజ్, బాజి, నష్రత్, షోను, అఖిల్, పుప్పాల వేణు, బోయిన వెంకట స్వామి, పద్మారావు, వరుణ్, ఫణి, ఖాసీం, హనుమంతు, మరో 70 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.