అమలాపురం అల్లర్లకు జనసేనకు ఏవిధమైన సంబంధం లేదు: పితాని

కోనసీమ జిల్లా ముమ్మిడివరం, కోనసీమలో జరిగిన అల్లర్లు నేపథ్యంలో వాటిని జనసేన పార్టీకి అపాదించటం ఒకటైతే, ప్రభుత్వసలహాదారు జూపూడి ప్రభాకరావు, శెట్టిబలిజలు ఒక దరిద్రులుగాను మత్తు బానిసలును అభివర్ణిస్తూ మాట్లాడిని మాటలకు క్షమాపణ చెప్పమంటే అయన క్షమించమని అడిగిన తీరు ఏమాత్రం సరికాదు. నేను మాట్లాడిన మాటలకు బాధపడిఉంటే కమించండి అనడంకంటే యావత్ శెట్టిబలిజ కులానికి బేషరతుగా క్షమాపణ చెప్పి ఉంటే బాగుండేది అని అన్నారు. బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అంటే మాకు దైవంతో సమానం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకు సాగుతూ అయన సాయసాధనకు ఎంతగానో కృషిచేస్తున్నారు. చౌకబారు రాజకీయాలు చేస్తూ ప్రజలల్ని మోసం మభ్యపెడుతూ బీసీ మంత్రులను బస్సుయాత్రలు చెయ్యడం హాస్యాస్పదం. వైసీపీ ప్రభుత్వంలో ఏవర్గానికి న్యాయం జరలేదు చట్టాలను తప్పుదోవ పట్టిస్తూ అనేక రకాల అక్రమాలకు పాల్పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం దళితులపై అనేకమర్లు దాడులు జరిపాయి మొన్న కాకినాడలో అనంతబాబు తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంన్ని ఇంటినుండి తీసుకుని వెళ్లి చంపి తీసుకొని వచ్చి తల్లితండ్రులు అప్పగించాడు. వైస్సార్ పార్టీ పై వస్తున్న అసమ్మతిని దారిమల్లించే ప్రయత్నంలో భాగంగా అల్లర్లు సృష్టించి వాటిని జనసేనపార్టీపై మోపడం సరికాదు. అమలాపురంలో జరిగిన అల్లర్లకు జనసేన పార్టీకి ఏవిధమైనా సంబంధం లేదు జనసేనపార్టీ నాయకులను గాని కార్యకర్తలని గాని ఏవిధమైన అక్రమ అరెస్టులు చేస్తే జరిగే పరిణామాలకు పూర్తిగా వైసీపీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు ప్రజలు అందరు గమనిస్తున్నారు. దీనికి త్వరలోనే తగన మూల్యం చెల్లించుకొక తప్పదని పితాని బాలకృష్ణ అన్నారు.