కౌలు రైతు కుటుంబాలకు అండగా జనసేన: ప్రమీలా ఓరుగంటి

పంట నష్టపోయి.. అప్పులపాలై.. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల
కుటుంబాలకు జనసేన పార్టీ అండగా నిలుస్తుందని మర్రిపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షురాలు ప్రమీలా ఓరుగంటి అన్నారు.

ఎన్.ఆర్.ఐ జనసైనికుడు మైలవరపు రాజా ఆద్వర్యంలో టీం పిడికిలి వారు రూపొందిచిన గోడ ప్రతులు, ఆటో స్టిక్కర్లును మంగళవారం మర్రిపాడు మండల కేంద్రంలో.. మండల అధ్యక్షురాలు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అప్పులుపాలై ఆత్మహత్య చెసుకున్న ఒక్కో కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయల చోప్పున 3 వేల మంది రైతులను ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ 30 కోట్ల సొంత నిధులను సమకూర్చడం జరిగిందన్నారు. ఇప్పటికే మూడు జిల్లాలోని కౌలు రైతు
కుటుంబాలకు సాయం అందించడం జరిగిందని ఆత్మహత్యకు చేసుకుని ప్రాణాలు కోల్పోయిన కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి సాయం అందించడం జరుగుతుందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతుల కోసం చేస్తున్న ఔదార్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ గోడ ప్రతులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. జనసేనపార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా టీం పిడికిలి వారు చేస్తున్న సేవలు వెళకట్టలేనివిఅని అమె తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఈరుపోతు ఉదయ్, మండల కార్యదర్శులు
కన్నెమరకల హరి కృష్ణ, కోక్కంటి రమేష్, మండలనాయకులు పెనుమాది నరసింహ,
చిన్నా జనసేన పాల్గొన్నారు.