రాష్ట్ర అభివృద్ధి కోసమే జనసేన: బండి రామకృష్ణ

■ రాష్ట్ర అభివృద్ధి కోసం, మచిలీపట్నం నియోజకవర్గంలో మార్పుకోసం జనసేన పార్టీని బలపరచాలని నియోజకవర్గ ఇన్చార్జి బండి రామకృష్ణ అన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో కార్పొరేషన్ పరిధిలోని ఐదు డివిజన్లకి ఇంచార్జిలు నియమించడం, జనసేన పార్టీ లో 100 మంది యువకులు చేరిక కార్యక్రమం సోమవారం రాత్రి పార్టీ కార్యాలయంలో జరిగింది.

ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని అన్నారు. కేవలం రెండు రాజకీయ పార్టీలు వ్యక్తిగత దూషణలకు మినహా ప్రజలకు కావాల్సిన మౌళిక సదుపాయాలు విషయంలో స్పందించక పోవడం విచారకరమని అన్నారు. నీతివంతమైన పాలన కోసం, మార్పు కోసం పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచాలని రామకృష్ణ అన్నారు.

■ కృష్ణాజిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ దేశంలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అగిపోయిన రాష్ట్రంగా ఉందని, దీనివల్ల భవిష్యత్తు అంధకారంగా మారబోతుంది అని బాలాజీ అన్నారు. ప్రజలందరూ రాష్ట్రంలోని విషయాలు గమనిస్తూ ఉన్నారని అన్నారు. ఇంటి పన్నులు 15 శాతం పెంచి, 90 రూపాయల చెత్త పన్ను వేసి ఇప్పుడు విద్యుత్ రేట్లు కూడా పెంచడానికి సిద్ధం చేయటం ప్రజలపై పెను భారం మోపడమే అన్నారు. అడగని వారికి ఫధకలు ఇచ్చి, అమాయకులపై పన్నుల పేరుతో వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

■ జిల్లా ఉపాధ్యక్షులు వంపుగడవల చౌదరి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల మద్దతు తో రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. ప్రజా సమస్యల మీద స్పందించే నిజాయితీ గల నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు.

■ నాలుగో డివిజన్ ఇంచార్జి పినిశెట్టి వేణు మాట్లాడుతూ మచిలీపట్నం నగరము ఎన్నికలలో నాలుగో డివిజన్ లో జనసేన పార్టీని ఆదరించిన డివిజన్ ప్రజలకు ఉచితంగా మంచినీళ్లు అందించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రజలు నీతి నిజాయితీకి ఓటు వేసినప్పుడు రాజ్యాంగం హక్కులు అందుబాటులో ఉంటాయి అని అన్నారు.

■వడ్డీ చిరంజీవి మాట్లాడుతూ జనసేన పార్టీలో యువతకి మహిళలకు ప్రథమ స్థానం కేటాయించడం జరుగుతుందని, యువత ప్రశ్నించే స్థాయిలో ముందుకు రావాలని అన్నారు.

■ మచిలీపట్నం నగరం 9వ డివిజన్ ఇంచార్జిగా తోట భాస్కర్ రావు, 11వ డివిజన్ ఇంచార్జిగా బండి కరుణాకర్, 15 డివిజన్ ఇంచార్జిగా సమీర్, 50వ డివిజన్ ఇంచార్జిగా రామి నాయుడు, 14వ డివిజన్ ఇన్చార్జిగా పృథ్వీరాజ్ ని నియమించారు. జనసేన పార్టీ కొత్తగాచేరిన 100 యువకులకు కండువాలు కప్పి పార్టీలోకి నాయకులు స్వాగతించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కర్రీ మహేష్, తోట ప్రసాద్, మైకేల్, చక్రి తదితరులు పాల్గొన్నారు.