జేమ్స్ కుటుంబానికి అండగా నిలచిన జనసేన నేత బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం: నకరికల్లు మండలం, చేజర్ల గ్రామంలో గురువారం ఎస్ సి కాలనిలో జూపల్లి జేమ్స్ భార్య జూపల్లి కమల కుమారి స్వర్గస్తులైనారు. విషయాన్ని మండల జనసేన అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మీ నాయకులు బొర్రా వెంకట అప్పారావుకి తెలియ పరచగా అప్పారావు దహన సంస్కారములకు కుమారి భర్త జమ్స్ కు పదివేల రూపాయలు ఆర్ధిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లక్ష్మీ శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శి యు. కోటేశ్వరరావు, ఏడవ వార్డు నెంబర్ సి.హెచ్ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ ఒకటవ వార్డు నంబర్ కె. వెంకట శ్రీను, ఎం బుజ్జి, కె నాగరాజు, ఎం శ్రీను, ఎం ఈగయ్య పాల్గొన్నారు.