జనసేన నేత వంగ లక్ష్మణ్ గౌడ్ అరెస్ట్!

నాగర్ కర్నూల్ నియోజకవర్గం: కుమ్మెర గ్రామంలో భూమి కోల్పోయిన రైతు అనంత అల్లోజి తరపున పోరాటం చేయడానికి వచ్చిన జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు నాగర్ కర్నూల్ ఇంఛార్జ్ వంగ లక్ష్మణ్ గౌడ్ ను, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులు పగడాల రాఘవేంద్ర పి ఆర్ మరియు జనసేన పార్టీ నాయకులను, జనసైనికులను గురువారం పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి, నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులు గోపాస్ కుర్మన్న, పడల రాఘవేంద్ర, నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు మహేష్ గౌడ్, తాడుర్ మండల అధ్యక్షులు ఎన్నిపొతుల భాస్కర్ సూర్య, వంశీ రెడ్డి, చెన్నమొని మహేష్, రాజునాయక్, మహేష్, పూస శివ, వెంకటేష్, చందు, సురేష్ మనికొండ, ఆరిఫ్, నాగరాజు, గద్వాల్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.