శ్రీకాళహస్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల పాఠశాల హాస్టల్ నందు పిల్లలకు బట్టలు పంచిన జనసేన నాయకులు

శ్రీకాళహస్తి, జనసేన పార్టీ తరపున శ్రీకాళహస్తి పట్టణంలోని బాలికల గిరిజన సంక్షేమ హాస్టల్‌ను సందర్శించి అక్కడి పిల్లలకు బట్టలు పంచడం జరిగింది. జనసైనికుడు రాము ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు పిల్లలను ఉద్ధేశించి మాట్లాడుతూ గొప్ప లక్ష్యాలను నిర్ధేశించుకుని ఆ లక్ష్యాల సాధనకై కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వి.లక్ష్మి శోభన్విత మరియు వారి సిబ్బంది జనసేన నాయకులకు ధన్యవాదములు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కార్యదర్శి కొట్టే సాయి, జయప్రకాష్ జనసేన నాయకులు మహేష్, చిరంజీవి, వంశీ, రాము తదితరులు పాల్గొనడం జరిగింది.