గాయపడిన జనసైనికునికి ఇన్సూరెన్స్ అమౌంట్ అందజేసిన జనసేన నాయకులు

కొత్తపేట నియోజకవర్గం, ఆత్రేయపురం మండలం, ఆత్రేయపురం గ్రామంలో చింత జ్యోతిబాబు కు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగింది. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ద్వారా ఆయనకు వైద్య ఖర్చుల నిమిత్తం 8,700 రూపాయలు చెక్కును కొత్తపేట జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్రేయపురం మండలం జనసేన పార్టీ ప్రెసిడెంట్ చేకూరి కృష్ణంరాజు, ఆత్రేయపురం గ్రామ పార్టీ ప్రెసిడెంట్ యాతం అబ్బిస్ మరియు మండల జనసేన పార్టీ నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.