పేలుడు సంభవించిన ప్రదేశాన్ని పరిశీలించిన జనసేన నాయకులు

ఏలూరు, జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డి పాలెం ఫోరస్ కెమికల్స్ ఫ్యాక్టరీని పేలుడు సంభవించిన ప్రదేశాన్ని కృష్ణా జిల్లా అద్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ సందర్శించడం జరిగింది. అక్కిరెడ్డిపాలెం గ్రామంలో బాధిత కుటుంబాలను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. గ్రామస్థులకు, బాధిత కుటుంబాలకు జనసేనపార్టీ అండగా ఉంటుందని అద్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, ప్రధానకార్యదర్శి బడిషా మురళీ కృష్ణ, జిల్లా కార్యదర్శిలు మానబోలు శ్రీనివాసరావు, చింతల లక్ష్మీకుమారి, సంయుక్త కార్యదర్శి రెడ్దిమని, జిల్లా అధికార ప్రతినిధి మరియుదు శివరామకృష్ణ, నియోజకవర్గ మండల నాయకులు రాము, కృష్ణ, కిరణ్, నియోజకవర్గ నాయకులు నాగబాబు, వెంకట్రావు, రామిరెడ్డి తేజస్విని, నెట్ల ఉమ మహేశ్వరి, లక్ష్మీ మరియు భారీగా జనసేనపార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.