జనసేన కార్యదర్శి జయమ్మను పరామర్శించిన జయరాం రెడ్డి

అనంతపురం: జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి శ్రీమతి విజయలక్ష్మి (జయమ్మ) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ మధ్యకాలంలోనే బెంగళూరు సాయితుంగ హాస్పిటల్ నందు చికిత్స చేయించుకున్నారు. భగవంతుని దయవల్ల శ్రీమతి విజయలక్ష్మి ఆరోగ్యం మెరుగుపడింది. విషయం తెలుసుకున్న అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, మెరుగు శ్రీనివాస్, భవాని నగర్ సాయికుమార్ మరియు తదితరులు అనంతపురం పట్టణం నందు జయమ్మ నివాస గృహానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది. భగవంతుని దయతో తొందరగా కోలుకోవాలని సంపూర్ణ ఆరోగ్యంతో మన అందరితో కలిసి వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయానికి జయమ్మ గారు తన వంతు కృషి చేస్తారని ఆశిస్తున్నామని తెలిపారు.