టీడీపీ కార్యకర్తల మృతికి సానుభూతి తెలిపిన పులి మల్లికార్జున రావు

ఉమ్మడి ప్రకాశం జిల్లా, కందుకూరు నియోజకవర్గం, కందుకూరు నడి పట్టణంలో ప్రభుత్వ ఏరియా వైద్యశాల ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఎదురుగా ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఎనిమిది మంది నిండు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వస్తే రాష్ట్రానికి ఇదేమి కర్మ అనే ప్రోగ్రాం చేస్తున్న చంద్రబాబు నాయుడు డిసెంబర్ 28వ తేదీ కందుకూరు నియోజకవర్గం రోడ్డు షోలో జనాలు ఎక్కువగా రావడం తొక్కిసలాట జరగటం, పక్కనే ఉన్న కాలవలో పడి, మరియు మోటార్ వెహికల్ కింద పడి తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది నిండు ప్రాణాలను కోల్పోయారు. పార్టీలు ఏదైనా మనుషుల ప్రాణాలు కోల్పోవడం కందుకూరు చరిత్రలో ఇదే ప్రప్రదమం. కందుకూరు నియోజకవర్గం లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు గురువారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. అలాగే గురువారం ఉదయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపూడి విజయ్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ఆదేశానుసారం కందుకూరి నియోజకవర్గ ఇన్చార్జ్ పులి మల్లికార్జున రావు కందుకూరు పట్టణానికి చేరుకొని సభా ప్రాంగణంలో ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాల వద్దకు వె,ళ్లి వారి కుటుంబాలకు కందుకూరు నియోజకవర్గ జనసైనికుల తరఫున, జనసేన పార్టీ తరఫున మరియు నాయకులు తరుపున ప్రగాఢ సానుభూతిని తెలియజేసి మరల ఇలాంటి సంఘటనలు పునరాతం కాకుండా చూడాలని రాజకీయ పార్టీలకు, పోలీసు అధికారులకు తెలియజేయడం జరిగింది. పార్టీలు ఏవైనా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఎంత ధన సహాయం చేసినా వారి కుటుంబంలో లోటు ఎవరూ తీర్చలేనిది, ఇటువంటి సంఘటనలు మరలా, మరలా పునరా ఇటువంటి సంఘటనలు మరలా మరలా పునరావృతం కాకూడదని, ఏ పార్టీలైనా తగు జాగ్రత్తలు తీసుకొని సరైన ప్రాంగణాల్లో సభలు నిర్వహించాలని తెలియజేస్తూ మరొకసారి జనసేన పార్టీ తరఫున మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుని కోరుకుంటున్నాను అని పులి మల్లికార్జున రావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు 38వ డివిజన్ కార్పొరేటర్ మలగా రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాయన్ రమేష్ మరియు జిల్లా, మండల, పట్టణ జనసేన నాయకులు పాల్గొన్నారు.