అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించిన అనంతపురం జనసేన నాయకులు

అనంతపురం: మనం నేడు సామాజిక, రాజకీయ, ఆర్థిక కారణాల వలన చిన్న చిన్న వర్గాలుగా విడిపోయి ఉన్నా, ఒకే జాతి గా నిలబడ గలమని విశ్వసిస్తున్నా అని చాటి చెప్పిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లా జనసేన నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించటం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్య నిర్వహణ ప్రధాన కార్యదర్శి భవానీ రవికుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన డాక్టర్‌ బి.ఆర్ అంబేద్కర్ గారు నేడు మన మధ్య లేక పోయినా అయన ఆశయాలు మాత్రం మన మదిలో చిరస్థాయిగా ఉంటాయి అని ఆయన బాటలోనే పయనిస్తున్న మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మనం ముఖ్యమంత్రి నీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా యువనాయకులు గల్లా హర్ష, రమణ మొబైల్స్ ఎస్.కే.యూ రమణ, నగర ప్రధాన కార్యదర్శి కమటం వెంకట నారాయణ, ఇమామ్ హుస్సేన్ , జయక్రిష్ణ, అంజి, ప్రసాద్ ఆకుల, మధు, చిన్న, సంతోష్, నాయకులు నవీన్, శ్రీనివాస్, ముస్తఫా, జగదీష్ లు ఆ మహనీయుని స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించారు.