బల్గురి సాగర్ కు నివాళులర్పించిన జనసేన నాయకులు

జనసేన పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ సూచనల మేరకు జగ్గయ్యపేట నియోజకవర్గం, పెనుగంచిప్రోలు మండలం, పెనుగంచిప్రోలు గ్రామంలో రోడ్డు ప్రమాదంలో జనసేన పార్టీ మండల కార్యదర్శి బల్గురి సాగర్ మరణించారు. జనసేన నాయకులు శుక్రవారం సాగర్ పార్దివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబానికి మనో ధైర్యాన్ని కల్గించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు బోలియశెట్టి శ్రీకాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాడిశ మురళీకృష్ణ జిల్లా కార్యదర్శి మనుబోలు శ్రీనివాసరావు మరియు పెనుగంచిప్రోలు మండల అధ్యక్షులు శివ, జగ్గయ్యపేట నియోజకవర్గం నాయకులు మండల నాయకులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.