మానవత్వంతో ప్రమాదకరమైన గుంతలు పూడ్చిన హుస్నాబాద్ జనసైనికులు

హుస్నాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ సూచన మేరకు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో, హుస్నాబాద్ నుండి మడత గ్రామానికి వెళ్ళే మూలమలుపు దారిలో రోడ్డుకి ఆనుకుని ప్రమాదకరమైన గుంత ఏర్పడి కొన్ని నెలలు గడుస్తున్నా.. అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో, జనసేన పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గం ఆధ్వర్యంలో సిమెంటుతో ఆ గుంతని పూడ్చడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ కోఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే రోడ్డు కావడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఇలాంటి చర్యలు జరుగకుండా అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొడిశెట్టి విజయ్, మొలుగూరి అరవింద్, బత్తుల జగదీష్, సంతోష్ పాల్గొన్నారు.