విటిపిఎస్ యాజమాన్యం నిర్లక్ష్యంపై మరోసారి ద్వజమెత్తిన జనసేన నాయకులు పోలిశెట్టి తేజ

ఇబ్రహీంపట్నం మండల జర్నలిస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో విటిపిఎస్ నుండి విలువడే కాలుష్యం గురించి జరిపిన చర్చా వేదికలో ఇబ్రహీంపట్నం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు మరియు తుమ్మపాలెం ఎంపీటీసీ పోలిశెట్టి తేజ తనదైనా శైలిలో ప్రశ్నించారు. గత నలభై ఏళ్ళ క్రితం నిర్మించిన స్టేజి వన్ ప్లాంట్ని వెంటనే మూసి వెయ్యాలని, ఎలాంటి కాలుష్య నివారణ చర్యలు తీసుకుండా పవర్ ప్లాంట్ ఎలా నడుతున్నారని ప్రశ్నించారు, కాలపరిమితి ముగిసినప్పటికి ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు, దాని ద్వారా పొగరూపంలో విడుదలయ్యే బూడిదవలన ఇబ్రహీంపట్నం మండలం మరియు కొండపల్లి మునిసిపాలిటీలోని ప్రజలు శ్వాసకోస సంబంధిత వ్యాధులు, చర్మ వ్యాధులకులోనవుతున్నారని, పశువులు కూడా గర్భ సంబంధిత మరియు అంతుచిక్కని వ్యాధితో ఇబ్బది పడుతున్నాయని, జూపూడి, కిలేశీపురం గ్రామలలో బూడిదనీరు పంట కాలువలలో చేరటంవలన భూమిలోని సారం తగ్గిపోయి పంట నష్టపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారని. ఇప్పటికైనా విటిపిఎస్ యాజమాన్యం కళ్ళుతెరిచి కాలుష్య నివారణ చర్యలు తీసుకోవాలని అలాగే తమ గ్రామ కెనాల్ వంతెన నిర్మాణాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలని లేదంటే అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటానికి సిద్ధమని తెలిపారు.