బచ్చల రామారావు కుటుంబాన్ని పరామర్శించి ఆర్దిక సహాయం అందించిన జనసేన నాయకులు

శ్రీకాకుళం జిల్లా, టెక్కలి‌ నియోజకవర్గం, సంతబొమ్మాలి మండలం సీతానగరం గ్రామంలో ఇటీవల విద్యుత్ షాక్ తో మృతి చెందిన బచ్చల రామారావు కుటుంబానికి శ్రీకాకుళం జిల్లా నాయకులు పేడాడ రామ్మోహన్ రావు మరియు టెక్కలి నియోజకవర్గం ఇంచార్జ్ కణితి కిరణ్ కుమార్ మరియు జనసేన నాయకులు సీతానగరం యూత్ అసోసియేషన్స్ సమక్షంలో ఆర్థిక సహాయాన్ని (రూ లు 60000/-) అందజేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ సహాయ కార్యక్రమంలో జనసేన నాయకులు లింగూడు కుమారస్వామి, పేడాడ త్రివేణి రావు, బుడ్డ గవరయ్య, ఆబోతు వెంకటరమణ, గద్దయ్ భాస్కరరావు, లింగుడు భీమారావు, ఇలపండ రమేష్, కొత్తూరు హరి, ధర్మ, కిరణ్, యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లింగూడు గిరి వర్మ, వైస్ ప్రెసిడెంట్ వాడరేవు సింహాచలం పాల్గొన్నారు.