మోర్ల రామకృష్ణ కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన జనసేన నాయకులు

తిరువూరు నియోజవర్గం, ఏ కొండూరు మండలంలో గల రామచంద్రపురం గ్రామంలో ఇటీవల కాలంలో జనసైనికుడు మోర్ల రామకృష్ణ తండ్రి మోర్ల చెన్నారావు క్యాన్సర్ వ్యాధితో పోరాడి స్వర్గస్తులవడం జరిగింది. వారి కుటుంబానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఉమ్మడి కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులుడు బొలియశెట్టి శ్రీకాంత్ మరియు కృష్ణ జిల్లా కార్యదర్శి మనుబోలు శ్రీనివాసరావు ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారిలో ఆత్మ ధైర్యాన్ని మరియు మేమున్నాము అనే భరోసాని ఆ కుటుంబంలో నింపడం జరిగినది. అదేవిధంగా జిల్లా మరియు నియోజకవర్గంలో నుంచి ఆ కుటుంబానికి 31,000 ఆర్థిక సహాయం అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఏ కొండూరు మండల అధ్యక్షుడు లాకావత్ విజయ్, గంపలగూడెం మండల అధ్యక్షుడు వెంకట కృష్ణ, ఏ కొండూరు మండల నాయకులు గూడవల్లి నరసింహారావు, పగడాల లక్ష్మణరావు, మనోజ్, ముదిగండ్ల సాయి కృష్ణ, వేంపాటి యేసయ్య, మరీదు శివకృష్ణ, రావుల కోటేశ్వరావు, సిద్ధంశెట్టి రవీంద్ర, మరియు రామచంద్రపురం గ్రామ జనసైనికులకు వీర మహిళలకు అలాగే తిరువూరు నియోజకవర్గం నుంచి విచ్చేసిన జనసైనికులకి అందరికీ ఏ కొండూరు మండల జనసేన పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు.